Kota Srinivasarao : విలనిజం లో కొత్త స్టైల్ చూపిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఆయన కమెడియన్ గాను విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కోట గారు సినిమాల్లోకి వచ్చేకన్నా ముందే బ్యాంకు లో ఉద్యోగిగా ఉండేవారు. కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాలను చేస్తూ రెండింటి మీద ప్రయాణం చేసారు. ఇక సినిమాల్లో మెల్లగా స్థిరపడిపోయాక ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో నటించారు. అలా సౌత్ భాషలలో నటించిన ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సినిమాల్లో నటించడం లేదు. అయితే పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు సమాకాలిన అంశాల గురించి మాట్లాడుతుంటారు.
ఓటేశారు అనుభవిస్తున్నారు…
కోట శ్రీనివాసరావుగారు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్నారు. సినిమాలలో ఉంటూనే రాజకీయాల వైపు వెళ్లిన అయన బిజెపి పార్టీ లో చేరి విజయవాడ నుండి ఎమ్మెల్యే గా పనిచేసారు. అయితే ఒకసారి మాత్రమే చేసిన ఆయన ఇక రాజకీయాలు మనకు సరిపడవని వాటి నుండి బయటికి వచ్చేసారు.
వాజపేయి గారంటే అభిమానం ఉండటం వల్ల బీజేపీ లో చేరినట్లు చెప్పిన ఆయన ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడుతూ అన్ని వలిచిపెట్టి చేతిలో పెట్టినట్లుగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. వాళ్ళేవో బ్రిడ్జ్ లు అవి కట్టుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. రాజధాని కూడా లేకుండా ఏపీ ఉంది. ఒకవేళ ఓట్లు వేసి తప్పు చేసుంటే నేడు ఏపీ ప్రజలు దాని వల్ల వచ్చిన ఫలితాలను అనుభవిస్తున్నట్లే కదా అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…