Categories: Political News

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

శ్రీకాళహస్తిలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరాయుడు మృతితో సంచలనం రేపిన కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. జనసేన మాజీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ కోటా వినూత మాజీ వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసరాయుడు చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతుడిగా కనిపించిన తర్వాత ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతడి చేతిపై ‘కోటా వినూత’ అని పేరుతో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను ఎవరో గుర్తించిన పోలీసులు, వెంటనే దర్యాప్తును ప్రారంభించారు.

Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

ఈ కేసులో విచారణను ముందుకు తీసుకెళ్లిన పోలీసులు, అనుమానాస్పదంగా కోటా వినూత మరియు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసులో మరికొంతమంది నిందితుల పేర్లు వెలుగులోకి రావడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. విచారణలో ఒక్కొక్కరుగా బయటపడుతున్న వివరాలు, ఈ కేసు ఎంత సంక్లిష్టమో స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు ఒక్కో కీలక ట్విస్ట్ బయటపడుతోంది. ఒక అంశాన్ని విశ్లేషిస్తున్నంతలో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది.

పలువురు మీడియా సంస్థలు వెల్లడించిన కథనాల ప్రకారం, శ్రీనివాసరాయుడు కోటా వినూతతో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఆమె పడకగదిలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడట. ఆ కెమెరాల ద్వారా వినూత, ఆమె భర్త మధ్య వ్యక్తిగత దృశ్యాలను రికార్డు చేశాడని ఆమె తెలిపినట్టు వార్తలు చెబుతున్నాయి. అనంతరం వాటిని 30 లక్షల రూపాయలకు ప్రత్యర్థి పార్టీకి విక్రయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కారణంగా అతడి హత్య జరిగిందని పలువురు అనుమానిస్తున్నారు.

అయితే, ఇక్కడే అసలు మలుపు మొదలవుతోంది. కోటా వినూత చెప్పిన కథనాలను పక్కన పెడితే, శ్రీనివాసరాయుడు ఆమె పడకగదికి ఎలా ప్రవేశించాడు? ఒక డ్రైవర్‌కు ఆ స్థాయిలో నమ్మకాన్ని ఎలా కల్పించారు? ఆ గదిలోకి వెళ్లడానికి సాధారణంగా కుటుంబ సభ్యులకే అవకాశం ఉండదు. అలాంటి ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆమె మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అంతే కాకుండా, అతడి చేతిపై ఉన్న పచ్చబొట్టు కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక డ్రైవర్, తన యజమానిని పచ్చబొట్టు వేయించుకునేంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది?

ఇంతలో శ్రీనివాసరాయుడుతో వినూత దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. కొన్ని పార్టీ నేతలు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు, శ్రీనివాసరాయుడు మృతికి సంబంధించి అతడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. అతడి నానమ్మ మీడియాతో మాట్లాడుతూ, “ఈ విషయం పవన్ కళ్యాణ్‌కి ముందే తెలుసు. నా మనవడి ప్రాణాలు కాపాడమన్నాం, కానీ పట్టించుకోలేదు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో సీక్రెట్ కెమెరాలు, వ్యక్తిగత వీడియోలు, డబ్బు లావాదేవీలు, రాజకీయ సంబంధాలు అన్నీ కలిసిపోయి విచారణను మరింత సంక్లిష్టంగా మార్చేశాయి. పోలీసులకు ఇది గందరగోళంగా మారిన కేసుగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే – ఈ చీకటి మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుంది? అసలైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది?

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago