Featured

అందం, అభినయం ఉన్న కృష్ణ కుమార్తె మంజుల ఎందుకు బాలకృష్ణ సరసన హీరోయిన్ గా వైదొలగాల్సి వచ్చింది.?!

సాధారణంగా సినిమా హీరోలు రిటైర్మెంట్ అనంతరం తమ కొడుకులను సినీ వారసులుగా ఎంట్రీ చేయిస్తుంటారు. కానీ కూతుర్లు అందుకు మినహాయింపుగా ఉంటారు. దీనికి దక్షిణ, ఉత్తరాది సినీ పరిశ్రమలు మినహాయింపేమీ కాదు. హీరోల వారసురాలిగా హీరోయిన్స్ రావడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. తండ్రి వారసత్వం తో వచ్చిన హీరో, హీరోయిన్స్ సినీ ఫీల్డ్ లోకి రావడం వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత నటనలో కొత్తదనం, సంభాషణల్లో నైపుణ్యత లేనట్లయితే వారి భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది.

అలా ఎంతో మంది వారసులుగా వచ్చి తమ సినీ భవిష్యత్తును పరీక్షించుకొని నెగ్గిన వాళ్ళు ఉన్నారు. అందులో ఓడిపోయి తిరుగుముఖం పట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది పూర్తిగా వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయారు. ఆయన వయసు పైబడటం తో తన కొడుకులను రమేష్ బాబు, మహేష్ బాబు లను సినీపరిశ్రమలోకి తీసుకువచ్చారు. రమేష్ బాబు బాలనటుడిగా పరిచయమై హీరోగా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత పెద్ద సక్సెస్ సినిమాలు లేకపోవడంతో ఆయన సినిమాల నుండి తిరుగుముఖం పట్టారు. మహేష్ బాబు కూడా బాలనటుడిగా కృష్ణ తో నటించి, ఆ తర్వాత రాజకుమారుడు సినిమా తో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఆ సినిమా తర్వాత మహేష్ బాబు అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలో కృష్ణ కుమార్తె మంజుల కూడా సినిమాల్లో నటించాలనుకున్నారు. అదే విషయం ఆమె నాన్నగారైన కృష్ణ తో చెప్పడం, దానికి ఆయన కూడా అంగీకరించడం జరిగింది. అలా మంజుల విషయాన్ని కృష్ణ గారు ఎస్.వి.కృష్ణారెడ్డి తో చెప్పగా ఆయన తీసే టాప్ హీరో చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఇలా కృష్ణ కుమార్తె మంజుల మనం తీయబోయే టాప్ హీరో సినిమాలో నటిస్తుందని ఎస్.వి కృష్ణారెడ్డి, బాలకృష్ణతో చెప్పగా ఆయన కూడా అంగీకరించారు.

అయితే విషయం తెలుసుకున్న కృష్ణ అభిమానులు మంజుల వేరే హీరోలతో హీరోయిన్ గా డ్యూయెట్ లు చేయడమేంటని.. వాహనాల్లో పెద్ద ఎత్తున కృష్ణ ఇంటికి చేరుకోవడం జరిగింది. ఒకవేళ బాలకృష్ణ సరసన మంజుల నటించినట్లయితే తాము ఆత్మహత్య చేసుకుంటామని కృష్ణ ఇంటి ముందు అభిమానులు బైఠాయించారు. అప్పుడు మంజుల టాప్ హీరో చిత్రంలో హీరోయిన్ గా నటించదు అని కృష్ణ చెప్పడంతో ఆయన అభిమానులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెలుగు లో నటిస్తే అభిమానులతో ఇబ్బంది ఉంటుందని మలయాళంలో ప్రముఖ నటుడు నంబియార్ మనవడు దీపక్ సరసన ఒక సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో షో అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నాని, కావ్యాస్ డైరీ, పోకిరి, ఏ మాయ చేసావే వంటి చిత్రాలను నిర్మించారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago