సీనియర్ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ ప్రస్థానంలో 183 సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా కృష్ణంరాజు గారికి చిన్నపాటి ప్రమాదానికి గురవ్వడంతో వైద్యులు ఆయనకు సర్జెరీ చేసారట.
పూర్తివివరాల్లోకి వెళితే.. కృష్ణంరాజు హైదరాబాద్ లో అయన నివశిస్తున్న ఇంట్లోనే ప్రమాదవశాత్తు కాలు జారిపదిపోయారట. ఈ క్రమంలో ఆయన కాలుకి గాయం అయిందట. హుటాహుటిన ఆయన్ని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా.. ఆయనను పరిశీలించిన వైద్యులు చిన్నపాటి ఆపరేషన్ చేశారట. ఈ క్రమంలో ఆయన కాలులో ఒక వేలుని కూడా తొలగించినట్టు తెలుస్తోంది. సర్జెరీ పూర్తయిన వెంటనే ఆయనను డిశ్చార్జ్ కూడా చేసేసారట. అయితే ప్రమాదమేమీ లేదని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది.
ఇక కృష్ణంరాజు.. ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ గురువు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతుంది. కృష్ణంరాజు సొంత బ్యానర్ ‘గోపికృష్ణా మూవీస్’ సమర్పణలో ఈ మూవీ రూపొందింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…