Putapuram: పవన్ వ్యూహంపై రాజకీయంగా దెబ్బ కొడుతున్న వంగా గీత.. గెలుపే లక్ష్యంగా?

Putapuram: పిఠాపురం నియోజకవర్గం పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగగా అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వంగ గీత ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక ఎన్నికలకు మరొక తొమ్మిది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన తరుపున ఎంతోమంది సినిమా ఆర్టిస్టులను జబర్దస్త్ టీం అలాగే మెగా హీరోలు అందరిని కూడా ఎన్నికల బరిలోకి దింపుతున్నారు అయితే ఈయన ప్రచార కార్యక్రమాలలో కూడా వైసిపి నేతలను దుర్భాషలాడుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు అందరినీ రంగంలోకి దింపారు. కానీ వంగా గీత మాత్రం పవన్ కళ్యాణ్ వ్యూహం పైన భారీగా దెబ్బ కొడుతున్నారని చెప్పాలి.

ఈమె ప్రచార కార్యక్రమాలు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ కూడా దుర్భాషలాడుతూ మాట్లాడలేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి మీడియా వారు ఎవరైనా ప్రశ్నలు వేసిన చాలా సౌమ్యంగా సమాధానాలు చెబుతున్నారు. ఆయన చదువు గురించి ప్రశ్నించిన ఆయన సినిమాలలో పెద్ద స్టార్ కదా ప్రజాసేవ కోసం చేయాలనుకున్నరేమో అంటూ మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడ కూడా దురుసుగా మాట్లాడలేదు.

సేవా కార్యక్రమాలే ప్లస్ పాయింట్..
ఇకపోతే తాను పిఠాపురంలో గెలిస్తే ప్రజలకు జరిగే లాభాలేంటి పవన్ కళ్యాణ్ గెలిస్తే లాభాలేంటి అనే విషయాలను కూడా వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఐదేళ్ల కాలంలో ఆమె కాకినాడ ఎంపీగా ఉంటూ కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో చేసిన అభివృద్ధి గురించి కూడా వివరిస్తూ వచ్చారు. ధనవంతురాలు, కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, సీనియర్ రాజకీయ నాయకురాలు, ప్రజలకు అందుబాటులో ఉండే వంగా గీతకు ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లుగా మారబోతున్నాయి. అయితే వీటన్నింటిని ఈమె తనకు అనుకూలంగా మార్చుకొని గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago