తెలంగాణ రాజకీయాలలో చెదిరిపోని ఇమేజ్ సొంతం చేసుకున్న నేత కల్వకుంట్ల తారకరామారావు అందరు షార్ట్ కట్ లో కేటీఆర్ అని పిలుస్తుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత ఆస్థాయిలో జనాలలో క్రేజ్ సంపాదించినా నేత ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కేటీఆర్ మాత్రమే అనడంలో అతిశయోక్తి కాదు. ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉంటారు. సామజిక, సమకాలిక అంశాలపై తనదైన రీతిలో స్పందించడమే కాకుండా.. ఎవరైనా సహాయం కోసం ట్విటర్ లో అభ్యర్థిస్తే అయన ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సహాయం చేస్తారు.
అయితే తాజాగా ఆయనకు ఒక వింత అనుభూతి ఎదురైంది… అది కూడా అయన వీరాభిమాని నుంచి. ట్విట్టర్ లో రవికిరణ్ అనే వీరాభిమాని ఒకరు కేటీఆర్ ను టాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. ఎపుడు ఏమి అడిగినా వెంటనే రియాక్ట్ అయ్యే మంత్రి కేటీఆర్ ఈ సారి మాత్రం చాలా విచారానికి లోనయ్యారు. దానికి కారణం అయన వీరాభిమాని ఒకరు వీపుపై కేటీఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఆ ఫోటోను కేటీఆర్ కు ట్వీట్ చేసాడు. ఆ ఫోటోను చుసిన కేటీఆర్ ఒకవేళ ఇది నిజమే అయితే.. తమ్ముడు నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అని ఘాటుగా స్పందించారు. “సారి బ్రదర్.. ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను.. ఇది ఆరోగ్యకరం కాదు అంటూ.. ” ఆ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…