Kukka Padma: సినిమా ప్రపంచం పైకి కనిపించినంత అందంగా లోపల ఉండదు. అందులోనూ ఎంతోమంది పేరు తెచ్చుకుని పైకి వచ్చినా లోపలున్న కుళ్ళు రాజకీయాలకు బలైపోతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుసగా సినిమాలు అందుకుని ఆపైన హీరోలకు చెల్లిగా కూడా రాణించిన నటి పద్మ గారు కూడా అలాంటి రాజకీయాలకే బలై సినిమా అవకాశాలు లేక ప్రస్తుతం కుటుంబ సభ్యుల మరణంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కొంతమంది అవకాశాలు రానివ్వలేదు…
కుక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పద్మ గారు, ఆ సినిమాతోనే కుక్క పద్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత వరుసగా ఎనిమిది సినిమాల్లో హీరోయిన్ గా ఆంధ్ర కేసరి, విముక్తి వంటి సినిమాల్లో నటించారు. ఇక మొండి ఘటం సినిమాలో చిరంజీవి కి చెల్లిగా నటించారు కుక్క పద్మ. అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో ఒక రచయిత తనని రెండో వివాహం చేసుకోవాల్సిందిగా అడగటం తిరస్కరించడంతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ఆమెకు అవకాశాలు రాకుండా చేసి ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్లిపోయేలా చేసాడు అంటూ పద్మ గారు ఎమోషనల్ అయ్యారు.
1986 వరకూ సినిమాల్లో బాగా నటించిన తాను ఆపైన సినిమాల్లో కనిపించలేదని తెలిపారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, ఇక ఆయన సంపాదనతోనే గడిచేది. నాకూ సినిమాల్లో పెద్దగా ఏమి వచ్చేది కాదు అంటూ చెప్పారు. ఇక సినిమాల్లో అవకాశాలు రావని అర్థమయ్యాక తన తండ్రి వివాహం చేయగా భర్తకు అప్పటికే పెళ్ళై పిల్లలున్నారు. విషయం తెలిసాక విడాకులు తీసుకున్నాను. అనాటి నుండి ఒంటరిగా హైదరాబాద్ లోనే ఉంటున్నా. ఇప్పటికీ సినిమాల్లో నటించడానికి కానీ డబ్బింగ్ చెప్పడానికి కానీ అవకాశాలు రానివ్వకుండా ఆ వ్యక్తి చేస్తున్నాడు అంటూ తిండికి కూడా కష్టమైందంటూ బాధపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…