Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ఈమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈమెను ఇంటర్వ్యూ చేయడంతో ఈమెకు భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చింది ఎంతోమంది పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈమె వద్ద ఫుడ్ తినే వాళ్ళు అంటే తన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఫుడ్ బిజినెస్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ జీవనాన్ని గడుపుతున్నటువంటి ఈమె పట్ల బిగ్ బాస్ బ్యూటీ సీరియల్ ఆర్టిస్ట్ కీర్తి భట్ సంచలనమైన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగుందని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము అయితే అక్కడ ఫుడ్ ఏ మాత్రం బాగాలేదని చికెన్ మొత్తం చాలా కారంగా రుచి లేకుండా చేశారని తనకంటే నేనే వంట బాగా చేస్తానని ఈమె చేసినటువంటి వీడియో కుమారి ఆంటీ బిజినెస్ పై భారీ దెబ్బ పడిందని చెప్పాలి అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా కుమారి ఆంటీ స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీర్తి గారు అక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడ లేను. వేరే ఊరికి వెళ్లాను దాంతో ఆరోజు వంట నేను చేయలేదు. అయినా మహిళలు వంట చేయడానికి మగవాళ్ళు వంట చేయడానికి చాలా తేడా ఉంటుందని తెలిపారు. ఇక ఆమె నా గురించి అలా మాట్లాడిన నేను తప్పుగా భావించను ఎందుకంటే నేను చేసే వంటలు అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదని ఈమె తెలిపారు.
అందరికీ నచ్చాలని లేదు…
ఈ విధంగా కీర్తి తన బిజినెస్ దెబ్బతీసేలా తన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెరిగేలా కుమారి ఆంటీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కుమారి ఆంటీ మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. దీంతో ఈమె వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ చదువుకో లేకపోయినా కుమారి ఆంటీ హుందాతనం ముందు నువ్వు వేస్ట్ అని కేవలం నీ స్వార్థం కోసం ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేశావంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…