Kumari Aunty: నేనేంటో నాకే తెలియదు… ఈ ప్రపంచాన్ని నాకు చూపించారు: కుమారి ఆంటీ

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు ఈమె హైదరాబాద్లో ఒక ఫుడ్ స్టాల్ బిజినెస్ చేస్తూ ఎంతో మంది ఆకలి నింపడమే కాకుండా ఆ బిజినెస్ ద్వారా తన ఫోటో కూడా నింపుకునేవారు ఇదే జీవనోపాధిగా కొనసాగుతూ ఉన్నటువంటి కుమారి అంటే ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు.

ఇలా ఈమె మాట తీరుతో ఏకంగా ఒక డిజే సాంగ్ కూడా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా కుమారి ఆంటీ ప్రెస్ రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. ఇక ఇటీవల కాలంలో ఈమె బుల్లితెర కార్యక్రమంలో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాదులో జరిగిన డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ కార్యక్రమంలో భాగంగా ఈమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కుమారి ఆంటీ మాట్లాడుతూ అసలు నేనెక్కడున్నాను ఏం చేస్తున్నాను అనే విషయాల గురించి నాకే సరిగా తెలియదు. ప్రపంచం అంటే ఏంటో తెలియని నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేశారు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం సోషల్ మీడియా అంటూనే ఈమె అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

చదువు పని లేదు..
ఇలా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయినటువంటి కుమారి అండి అనంతరం ఒక పద్యాన్ని కూడా పాడారు ఈ పద్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పాలి మనిషికి ఒక ఆశయం ఉంటే చదువుతో పనిలేదని ఆశయ సాధన కోసం కష్టపడితే లక్ష్యాన్ని చేరుతారని ఈమె ఒక పద్యం రూపంలో ఎంతో స్ఫూర్తి దాయకమైనటువంటి వ్యాఖ్యలను చేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.