బిగ్‌బాస్ సీజన్ 5 గ్రాండ్‌గా మొదలైన విషయం తెలిసిందే.. ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ ఎంతో సందడిగా ఉంది. ఇక ఈ షోలో సోమవారం మొదటి రోజు ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ఏం జరిగిందనే దగ్గర నుంచి ప్రారంభమైంది మొదటి రోజు బిగ్ బాస్ షో.. ఈ క్రమంలో నటుడు లోబో గురక పెట్టి నిద్రపోతున్న దృశ్యాలు కనిపించాయి. దానిని కవర్ చేసేందుకు ఇంటి సభ్యులు పడే పాట్లు కాస్త నవ్వు తెప్పించాయి.
ఈ నేపద్యంలో ఇంటి సభ్యులను ఉద్దేశించి లహరి శరి కొన్ని వ్యాఖ్యలు ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె మాట్లాడుతూ.. ఇక్కడకి రాకముందు హౌస్ లో ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ నడిపించాలని అనుకున్నానని.. తీరా ఇక్కడకి వచ్చాక చూస్తె చాలా మంది పెళ్లైన వాళ్ళే ఉన్నారని, ఇక సన్నీ ఉన్నా తనకు ఇదివరకే తెలుసనీ అందువల్ల అతనిపై అటువంటి ఫీలింగ్స్ లేవంటూ మాట్లాడింది. మరో కంటెస్టెంట్స్ శ్రీరామ్ చంద్ర, జెస్సీ ల గురించి మాట్లాడుతూ.. శ్రీరామచంద్ర ఎందుకో కనెక్ట్ అవ్వలేదని, ఇక మోడల్ జెస్సీ తో అసలు ర్యాపో కుదరడం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఇలా చేసారెంటి బిగ్‌బాస్ అంటూ కాజల్‌తో చెప్పుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…