Movie News

అసలు ఎవరు ఈ లోబో.. చిన్నప్పుడు దొంగతనంతో మొదలైన ప్రయాణం.. బిగ్‌బాస్‌ వరకూ వచ్చిందని మీకు తెలుసా?

లోబో అంటేనే అందరికీ టక్కున అతని వేషధారణ గుర్తుకొస్తుంది. విచిత్రమైన వేషధారణలో అందరినీ సందడి చేస్తూ ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండిపోతారు. కెరియర్ మొదట్లో యాంకర్ గా పరిచయమైన లోబో ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈయన పేరును మాత్రం ప్రేక్షకులు మర్చిపోలేదు. యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేసిన లోబో ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ ఫైవ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే బిగ్ బిగ్‌బాస్‌ లోకి అడుగుపెట్టిన లోబో గురించి నెటిజన్లు పెద్దఎత్తున సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. లోబో ఎవరు.. ఏంటి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.. లోబోగా అందరికీ పరిచయమైన ఇతని అసలు పేరు మహమ్మద్‌ ఖయ్యూం. ఇతను పక్క హైదరాబాద్ వాసి. ప్రస్తుతం ఇతని వయస్సు 39 సంవత్సరాలు. 8వ తరగతి వరకు చదువుకున్న లోబో తొమ్మిదవ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్లో ఏదో దొంగతనం కారణంగా తనకి టీసి ఇచ్చి పంపించారు.

ఈ విధంగా పైచదువులకు నోచుకోని లోబో హీరోయిన్ కాజోల్ అంటే ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఆమెను కలవడం కోసం ఇంట్లో కొంత డబ్బును దొంగలించి ముంబైకి వెళ్ళాడు. అలా ముంబైకి వెళ్లిన లోబో హీరోయిన్ కాజోల్ ను కలవకపోగా తన వెంట తీసుకెళ్లిన డబ్బులు మొత్తం అయిపోయాయి. ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలను అనుభవించిన అతను ముంబై నుంచి కొందరి సహాయంతో గోవా చేరుకున్నారు.

ఈ విధంగా గోవాలో టాటూ వేయడం నేర్చుకున్న లోబో తిరిగి హైదరాబాద్ చేరుకొని టాటూ బిజినెస్ పెట్టారు. ఇలా టాటూ వేసే సమయంలో ఒక రష్యన్ యువతి ఇతను వేసిన టాటూ బాగా నచ్చడంతో అప్పటివరకు మహమ్మద్‌ ఖయ్యూంగా కొనసాగుతున్న అతనికి రష్యన్ యువతి ఎంతో ముద్దుగా లోబో అనే పేరును పెట్టింది. అయితే ఆ పేరు తనకి నచ్చడంతో అప్పటి నుంచి లోబోగానే కొనసాగుతున్నారు. లోబో పేరు ద్వారా యాంకర్ గా పరిచయమైన ఇతను ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి లోబో బిగ్‌బాస్‌ హౌస్ ద్వారా ఎలాంటి పాపులారిటీని దక్కించుకుంటారో వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago