నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడని మోక్షజ్ఞ ఏకంగా తన అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు మోక్షజ్ఞకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే కొందరు నందమూరి అభిమాన సంఘం నాయకులు నేరుగా బాలకృష్ణ ఇంటికి వెళ్లి తన కొడుకు మోక్షజ్ఞకు బోకెలూ ఇస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ అభిమానుల మధ్య కేక్ కట్ చేస్తూ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.సాధారణంగా బయట కనిపించడానికి ఇష్టపడని మోక్షజ్ఞ ఇలా తన పుట్టిన రోజును అభిమానుల మధ్య జరుపుకోవడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
నేడు(సెప్టెంబర్ 6) పుట్టిన రోజు జరుపుకుంటున్న మోక్షజ్ఞ బర్త్ డే సీడీపీని దర్శకుడు గోపీచంద్ మలినేని లాంచ్ చేశారు.ప్రస్తుతం “అఖండ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే గత రెండు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు.
ఈ పుట్టిన రోజు తర్వాత అయినా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి స్పష్టత ఇస్తారేమోనని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులతో కలిసి కేక్ కట్ చేసినటువంటి ఫోటోలను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…