ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ ఎంతో సందడిగా ఉంది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి అసలు ఆట మొదలవడంతో ఈ వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లకు టాస్క్ ఇచ్చి వారి మధ్య గొడవలను క్రియేట్ చేస్తూ.. కొందరిలో ఉన్న ఎమోషన్స్ ను బయటకి పెడుతూ నామినేషన్ ప్రక్రియను కొనసాగించారు.
ఈ క్రమంలోనే ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో భాగంగా హౌస్ సభ్యులందరికీ నామినేషన్ ప్రక్రియనిస్తూ ఒక టాస్క్ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా 19 మంది కంటెస్టెంట్ ల ఫోటోలను ఒక బ్యాగ్ కి కట్టి ఒక చోట పెట్టారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ఒక్కొక్కరిగా వెళుతూ వారికి నచ్చని కంటెస్టెంట్ ఫోటో ఉన్న బ్యాగులను పక్కనే ఉన్న చెత్త ట్రాలీలో వేయాలనే టాస్క్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఒక్కొక్కరు కంటెస్టెంట్ లు వెళ్తూ వారికి నచ్చని కంటెస్టెంట్ లో ఫోటో ఉన్న బ్యాగ్ ను తీసుకొని వారు ఎందుకు చెత్త ట్రాలీలో వేస్తున్నారో చెబుతూ ఆ బ్యాగులను పడేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటగా లోబో వెళ్లి ఉమాదేవి, షణ్ముఖ్ ఉన్న బ్యాగ్ ను తీసి అక్కడే పెడతారు. చివరికి యాంకర్ రవి ఫోటో ఉన్న బ్యాగ్ ను తీసుకొని నీ ఆటిట్యూడ్ నీదగ్గర ఉంచుకో అంటూ అతని తీసుకు వెళ్లి పడేస్తాడు.
ఇలా ఒక్కొక్కరుగా వారికి నచ్చని కంటెస్టెంట్ లను తీసుకువెళ్లి అక్కడ వేయడంతో కంటెస్టెంట్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విశ్వ మోడల్ జెస్సి ఫోటో ఉన్నటువంటి బ్యాగ్ తీసుకొని పొద్దున ఒక సిచువేషన్ జరిగింది అంటూ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత రవి మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారంటూ నటరాజ్ మాస్టర్ ని అనగా నాకు నటించడం రాదు అని సమాధానం చెబుతాడు. చివరికి నట రాజ్ మాస్టర్ మోడల్ జెస్సీని ఉద్దేశించి చిన్నోడా ఇక్కడ అమాయకత్వంగా ఉంటే తొక్కేస్తారు అంటూ అనడంతో జెస్సీ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టారు. ప్రస్తుతం స్టార్ మా విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ పై ఉత్కంఠతను నెలకొల్పుతుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…