Lakshmi Manogna : క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక చిన్నారి తన ప్రతిభ మాత్రం అన్ స్టాపబుల్ అని నిరూపించుకుంటోంది. లక్ష్మి మనోజ్ఞ అటు పాటలు పాడటంతో పాటు డాన్స్ కూడా చక్కగా చేస్తుంది. ఇక పేపర్ క్రాఫ్ట్స్ చేయడం కూడా చాలా చక్కగా చేస్తుంది. అలాంటి లక్ష్మి మనోజ్ఞ కు బ్లడ్ క్యాన్సర్ అని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా లక్ష్మి మనోజ్ఞ తల్లిదండ్రులు క్రుంగిపోయారు. అయితే లక్ష్మి మనోజ్ఞ తన టాలెంట్ అక్కడితో ఆగిపోకూడదని డిసైడ్ అయింది. పాటలను సాధన చేస్తూ ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించింది. అన్ స్టాపబుల్ షో ద్వారా లక్ష్మి ప్రతిభ అందరికీ తెలిసింది.
క్యాన్సర్ తో పోరాడుతూనే…
లక్ష్మి మనోజ్ఞ తొమ్మిదో తరగతి చదివుతున్న అమ్మాయి, 2020 ఆగస్టు లో అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. వైద్యం కోసం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్ళవలసిందిగా తిరుపతిలో సూచించారు. ఇక హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూనే 33 నిమిషాల్లో 18 పాటలు పాడి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించింది. అంతేకాకుండా ఎంతో చక్కగా పేపర్ క్రాఫ్ట్స్ చేసే లక్ష్మి మనోజ్ఞ ఏమాత్రం తన అనారోగ్యం గురించి అధైర్య పడటం లేదు.
ఎంతో ఆత్మవిశ్వాసంతో కేవలం సామాజిక మాధ్యమాలలో పాటలను విని నేర్చుకుని చక్కగా పడుతోంది. అదికూడా తెలుగు మాత్రమే కాకుండా కొరియన్, సింహాళ ఇలా ఇతర భాషలను ట్రై చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక డాన్స్ కూడా చాలా చక్కగా చేసే మనోజ్ఞ ప్రతిభకు మంచి అవకాశాలు రావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం లక్ష్మి మనోజ్ఞ ఇంకా క్యాన్సర్ చికిత్స లోనే ఉంది మరో ఒకటిన్నర సంవత్సరం పాటు తనకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరగనుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…