Mega Sankranthi: రాష్ట్రవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా సంక్రాంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు వారి సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
తెలుగువారికి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం మెగా కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. బెంగుళూరులోని తమ ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులందరూ కూడా మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ పండుగ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగా ఫ్యామిలీ మొత్తం రెడ్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ లో దిగినటువంటి ఈ ఫోటోని మెగా ఫ్యామిలీ మొత్తం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఒకే ప్రేమ్ లో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ హాజరై సందడి చేశారు.
స్పెషల్ అట్రాక్షన్ గా అకిరా ఆద్య..
ఇకపోతే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ కూతురు ఆధ్యా కూడా ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొని సందడి చేశారు. ఈ ఫోటోలలో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇలా అందరూ ఒకే చోట చేరడంతో మెగా కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…