Praveen -Faima: పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రవీణ్ ఫైమా ఒకరు. అనంతరం వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా సందడి చేశారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా వీరిద్దరూ ఎన్నో రకాల స్కిట్లు చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వార్తలు వచ్చిన విధంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు.
ఇలా వీరిద్దరూ తమ ప్రేమ విషయం గురించి పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఫైమాకి బిగ్ బాస్ అవకాశం వచ్చింది దీంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి ఈమె అనంతరం స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే చాలా రోజుల తర్వాత ఫైమా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేశారు.
నచ్చలేదని చెప్పింది..
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోలో భాగంగా అసలు వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలని రష్మీ హైపర్ ఆది ఇంద్రజ ఫిక్స్ అయ్యారు. ఇదే విషయం గురించి గట్టిగా నిలదీయడంతో ప్రవీణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ..ఫైమా నాతో మాట్లాడుతూ నేను తనకి నచ్చలేదని డైరెక్ట్ గా నాకే చెప్పిందంటూ అసలు విషయం బయటపెట్టారు. ఇలా వీరిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ డిస్టబెన్స్ ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. మరి వీరిద్దరి మధ్య నిజంగానే బ్రేకప్ అయ్యిందా అనే విషయం తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ పూర్తి ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…