Getup Sreenu: గెటప్ శ్రీను పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ వెండితెరపై మాత్రం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ తో కలిసి ఈయన ఎన్నో అద్భుతమైన స్కిట్లలో నటించారు. ఇక వెండి తెరపై ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన ఆస్తుల చిట్టా విప్పారు.
తాను హైదరాబాదులో ఉండటానికి సొంత ఇల్లు అలాగే ఒక కారు కొన్నానని ఈయన తెలిపారు. మరి సొంత ఇల్లు కార్లు అంటే ఇవన్నీ కోట్లలో విలువ చేసేది కాదని తెలిపారు. ప్రతినెలా వీటికి నేను ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని కూడా గెటప్ శ్రీను తెలియజేశారు. నేను ఉన్నతంగా బ్రతకడం కోసం పెద్దపెద్ద కమిట్మెంట్స్ కి ఒప్పుకోనని అలాంటివి ఉంటే అధిక ఒత్తిడి ఉంటుందని నిద్ర కూడా పట్టదని ఇంతకన్నా పెద్ద దరిద్రం మరొకటి ఉండదని తెలిపారు.
ఉన్నంతలోనే హ్యాపీగా ఉన్నా..
ఇలాంటివి ఉంటే నిద్ర కూడా సరిగా పట్టదని ఉదయం లేస్తేనే చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేలా ఉండాలి కానీ ఇలాంటి టెన్షన్స్ ఉండకూడదని ఈయన తెలిపారు. తాను ఉన్నంతలోనే చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాను అంటూ ఈ సందర్భంగా గెటప్ శ్రీను తన ఆస్తుల గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…