Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసినటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు ఈయన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరమైనటువంటి శివ మరోసారి బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఈయన మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచినటువంటి శివాజీ మరో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ వెబ్ సిరీస్ కూడా మంచి హిట్ కావడంతో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక రాజకీయాల గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురు కావడంతో ఒక్కసారిగా ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడటం వేస్ట్ ఒక్కో పార్టీకి ఒక్కో అభ్యర్థి మద్దతు తెలుపుతున్నారని ఈయన వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వం 100 రూపాయల ఖర్చు చేస్తుంది అంటే 200 వాళ్ల నుంచి తీసుకుంటుందని ఈయన వెల్లడించారు.
ఆ హక్కు మీకు లేదు..
ప్రజల డబ్బు గురించి రాజకీయ నాయకులు అసలు ఆలోచించరని తెలిపారు.ప్రస్తుత సమాజం బాగోలేదు. ప్రభుత్వం బాగోలేదు అనే హక్కు మీకు ఎక్కడ ఉందిరా పనికిమాలినోళ్ళారా జనాలకు కాస్తయినా సిగ్గుండాలి. అంటూ శివాజీ ప్రజల ఆలోచనల పై సీరియస్ అయ్యారు. మొత్తానికి రాజకీయాల గురించి శివాజీ మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…