Lavanya Tripati: మెగా ఇంటికి మరో కోడలు రాబోతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో నాగబాబు ఇంట్లో ఎంతో ఘనంగా నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు మెగా అల్లు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
ఇక లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా అడుగుపెట్టబోతున్నారనే విషయం తెలియడంతో ఎంతోమంది లావణ్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నారు.ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె తల్లిదండ్రులు ఎవరు ఏంటి అనే విషయాల గురించి చాలామంది ఆరా తీస్తున్నారు.
లావణ్య త్రిపాటి ఫ్యామిలీ విషయానికి వస్తే ఈమె అయోధ్యలో జన్మించారు. ఈమె తండ్రి హైకోర్టు న్యాయవాది తల్లి టీచర్గా పని చేస్తున్నారట. ఇక ఈమెకు ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు.అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి ఒక డైలాగ్ చెప్పారు. ఈ చదువులు చదవడం నా వల్ల కాదు నాన్న నాకు తొందరగా పెళ్లి చేసి పంపించండి అనే డైలాగ్ చాలా క్యూట్ గా అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ తన నిజ జీవితానికి కూడా సరిపోతుందని తెలుస్తోంది.
ఈమెకు చదువుపై పెద్దగా ఆసక్తి ఏమాత్రం లేదట ఈమె ఆసక్తి మొత్తం సినిమాల వైపే ఉండడంతో ఈ విషయం తన తండ్రికి చెప్పగా తన తండ్రి డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమాలలోకి వెళ్ళమని చెప్పారు దీంతో ఈమె ముంబై వచ్చి ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారని తెలుస్తుంది. అనంతరం మోడలింగ్ చేస్తూ మిస్ ఉత్తారాఖండ్ టైటిల్ కూడా గెలుచుకుంది. లావణ్య త్రిపాఠి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆమెకి భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఇలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ 2012 వ సంవత్సరంలో అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…