ప్రపంచ దేశాలతోపాటు ఇండియాలో కూడా కరోనా తన పంజా విసురుతుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విధుల చేసిన లెక్కల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేలు దాటింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 3500 కేసులు నమోదయ్యాయి అంటే దేశంలో మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో రెండో దశను దాటి సామూహిక వ్యాప్తికి ప్రవేశిస్తున్నట్టు ఎయిమ్స్ సైతం ధ్రువీకరించింది. దేశం మొత్తం మీద 211 జిల్లాలలో ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
వివిధ రాష్ట్రాల సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 5 వేలు దాటాయి. ఈ మహమ్మారి బారిన పది మృతిచెందిన వారి సంఖ్య 165కి చేరుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ఇప్పుడు ఎత్తివేస్తే ఈ వ్యాధి మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ పలు రాష్ట్రాలు ప్రధానికి సూచించాయి. ఈ నేపథ్యంలో మరి కొద్దిరోజులు లాక్ డౌన్ పొడిగిస్తే ఈ కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందనే ఆలోచనలో కేంద్ర ఉన్నట్టు సమాచారం. అయితే లాక్ డౌన్ పొడిగింపు దాదాపుగా కేంద్రం నిర్ణయానికి వాచినట్టు తెలుస్తోంది. రాజ్ నాధ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల బృందం ఈ మేరకు తీర్మానం చేసినట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రానికి ఆ బృందం సిఫార్సు చేసిందని తెలుస్తోంది. ఈమేరకు మే 15 వరకు లాక్ డౌన్ పొడిగించాలని అభిప్రాయానికి ఈ బృందం వచ్చినట్టు సమాచారం. అయితే ఈ లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని ఇంకా ఆమోదించలేదని చెబుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…