పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను మరోసారి పెంచేశాయి. దీంతో గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందనే చెప్పవచ్చు. ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు మళ్లీ రూ.25 పెరిగింది. ధరల పెంపు సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది.
గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం. సిలిండర్ ధర పెంపు నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు రూ.884కు చేరింది. హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.937 కి చేరుకుంది. దాదాపు గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 కి చేరువలోకి వస్తోంది. ఇదిలా ఉండగా.. సబ్సిడీ కింద ప్రతీ సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఆ డబ్బులు మొదట చెల్లించిన తర్వాత గ్యాస్ ఎవరి పేరుపై ఉందో వాళ్ల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రిడిట్ అవుతాయి. అయితే కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఆ డబ్బులు అనేవి క్రెడిట్ కాంకుడా ఉంటాయి. వాళ్లు మొట్టమొదటి సారిగా చేయాల్సిన పని ఏంటంటే.. ఆధార్ కార్డును తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసి ఉండాలి.
ఆ ఆధార్ నంబర్ ను ఎల్‌పీజీ ఐడీకి కూడా లింక్ చేయాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా సబ్సిడీ రాకపోవచ్చు. ఒక వేళ రెండు నుంచి మూడు దఫాల వరకు సబ్సిడీ రానట్లయితే పైన చెప్పిన విధంగా చేస్తే.. అన్ని నెలలకు ఒకే సారి సబ్సిడీ క్రెడిట్ అవుతుంది. సబ్సిడీ వచ్చింది.. రానిది తెలుసుకోవాలంటే.. http://www.mylpg.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నా.. సబ్సిడీ రాకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…