M.M Keeravani: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో వివిధ రంగాలలో అద్భుతమైన సేవలను కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మా పురస్కారాలను అందిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు.
ఇందులో ఆరుగురు పద్మవిభూషణ్ అవార్డు అందుకోగా, 9 మందికి పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు.ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీకి ఎంతో సేవలు చేసినటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు.
కీరవాణి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకోగా తాజాగా ఈ సినిమా కీర్తి కిరీటంలోకి మరొక అవార్డు వచ్చి చేరింది.ఈ సినిమా సంగీత దర్శకుడిగా అద్భుతమైన బాణీలు సమకూర్చిన ఎం ఎం కీరవానికి పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది ఇలా తాజాగా మరోసారి ఈ పాటకు సంగీతం అందించిన కీరవానికి పద్మశ్రీ పురస్కారం రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనసు మమత చిత్రంతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కీరవాణి ఇప్పటివరకు11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 8 ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకోగా మూడు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డులు అందుకున్నారు.తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. త్వరలోనే ఈయన ఆస్కార్ అవార్డును కూడా అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…