Movie News

Chiranjeevi -Sankranthi Movies: చిరంజీవి సినీ కెరియర్లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఇవే… ఏవి హిట్టు… ఏవి ఫట్!

Chiranjeevi -Sankranthi Movies: సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమాలో పెద్ద ఎత్తున విడుదలవుతూ ఉంటాయి. ఇలా సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు పోటీపడుతూ ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవిసంక్రాంతి బరిలో దిగిన సినిమాలు ఏంటి ఇందులో ఏ సినిమాలో హిట్ అయ్యాయి. ఏ సినిమాలో ఫ్లాప్ సొంతం చేసుకున్నాయో ఓ లుక్ వేసేద్దాం.

తాయారమ్మ బంగారయ్య: 1979లో విడుదలైన ఈ చిత్రం చిరంజీవికి హీరోగా మొదటి సినిమా. ఈ సినిమా 1979 జనవరి12 విడుదలై మంచి విజయం అందుకుంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు: 15 జనవరి 1981లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేదు ఇందులో చిరు సెకండ్ హీరోగా నటించారు.

ప్రేమ పిచ్చోళ్ళు: జనవరి 14 1983 లో విడుదలైన ప్రేమ పిచ్చోలు సినిమా హిందీ షౌకీన్స్ సినిమాకు రీమేక్ చిత్రంగా తిరికేక్కింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

చట్టంతో పోరాటం: జనవరి 5 1985లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది.

కిరాతకుడు: జనవరి 1,1986 లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

దొంగ మొగుడు: 9 జనవరి 1987 విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

మంచి దొంగ: 14 జనవరి 1988న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు: 14 జనవరి 1989న విడుదలైన ‘అత్తకుయముడు అమ్మాయికి మొగుడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

స్టువర్టుపురం పోలీస్ స్టేషన్: 9 జనవరి 1991 విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ముఠామేస్త్రి: 17 జనవరి 1993లో విడుదలైన ముఠామేస్త్రి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ముగ్గురు మొనగాళ్లు: 9 జనవరి 1994లో విడుదలైన ఈ సినిమాలో మొదటిసారి చిరంజీవి త్రిపాత్ర అభినయంలో నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

హిట్లర్: 4 జనవరి 1997 న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Chiranjeevi -Sankranthi Movies:

స్నేహం కోసం: 1జనవరి 1999 విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించారు ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

అన్నయ్య: 7 జనవరి 2000 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మృగరాజు: 11 జనవరి2001 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

అంజి: 15 జనవరి 2004న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఖైదీ నెంబర్ 150: 11 జనవరి 2017 న విడుదలైన ఈ సినిమా చిరంజీవి రీఎంట్రీ సినిమా ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

వీర సింహారెడ్డి: జనవరి 13 2023 నవిడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago