Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మరోవైపు కమర్షియల్ యాడ్ ద్వారా రెండు చేతుల భారీగా సంపాదిస్తున్నారు. ఇలా మహేష్ బాబు ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడం కోసం ఈయన కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
ఈ విధంగా మహేష్ బాబు ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కారణం మరేది లేదు ఈయన తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఇతర మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. అందుకోసమే ఈయన ఇలాంటి కమర్షియల్ యాడ్స్ చేస్తూ తన పౌండేషన్ కి విరాళంగా అందిస్తుంటారు.అయితే ఒక్కో యాడ్ కోసం కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే మహేష్ బాబు హిల్ ఎ చైల్డ్ అనే ఫౌండేషన్ కోసం ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నారు.
తాజాగా ఈ కార్యక్రమానికి మహేష్ బాబు నమ్రత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే కాకుండా ఈ ఫౌండేషన్ ప్రమోట్ చేయడం కోసం ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది అయితే ఈ సంస్థ ద్వారా ఎంతో మంది చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి చికిత్స ఉచితంగా అందిస్తుంది.
ఈ క్రమంలోనే చిన్నారుల కోసం ఎంతో సేవ చేస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…