‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. హీరోయిన్ శ్రీలీల, నటుడు మహేష్ ఆచంట మధ్య ఏదో అసౌకర్యకర పరిస్థితి ఏర్పడిందన్న ప్రచారం నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ రూమర్స్‌పై మహేష్ తాజాగా స్పందిస్తూ అసలు విషయం ఏంటో వివరించారు.
సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఆయన మాట్లాడుతూ, ఆ సమయంలో ఎలాంటి వివాదం జరగలేదని స్పష్టం చేశారు. శ్రీలీల తన ఫోన్ ముందుగానే తన దగ్గర పెట్టిందని, ఆ తర్వాత ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు, తాను ఫోన్ కోసం చూస్తున్నానని అనుకుని ఉండవచ్చని తెలిపారు. కానీ వెంటనే ఆమె స్క్రీన్ వైపు చూసి తిరిగి ముందుకు వెళ్లిపోయిందని చెప్పారు.
ఈ చిన్న సంఘటనను కొందరు తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం చేస్తున్నారని మహేష్ పేర్కొన్నారు. తాను ఎవరినీ అవమానించేలా ప్రవర్తించలేదని, అక్కడ జరిగినది సాధారణ పరిస్థితి మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ఆనందంగా ఉందని చెప్పారు. దర్శకుడు హరీశ్ శంకర్తో పనిచేయడం మంచి అనుభవమని, ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే పవన్ కల్యాణ్తో కలిసి పని చేయడం తనకు ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు.
ఈ వివరణ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కు చెక్ పడినట్టే కనిపిస్తోంది. అభిమానులు కూడా అనవసరంగా విషయాలను వక్రీకరించకూడదని కామెంట్స్ చేస్తున్నారు.
దక్షిణాది సంగీత ప్రపంచంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనిరుధ్ రవిచందర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే వరుస…
దివంగత నటి శ్రీదేవికు సంబంధించిన ఆస్తి వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమె కుటుంబానికి మద్రాస్ హైకోర్టు…
క్రికెట్ అభిమానులను ప్రతి ఏడాది అలరించే ఐపీఎల్లో భారీ సిక్సర్లు, రికార్డులు సహజం. ప్రతి సీజన్‌లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి.…
సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రముఖ నటి రేణు…
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ గాయని తాజాగా ఓ…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సినీ నటీమణుల పేర్లు అనవసరంగా చర్చకు రావడం వివాదానికి దారితీసింది. ప్రముఖ నటి, లేడీ సూపర్…