టాలీవుడ్ లో మొదటి సినిమా అష్టాచెమ్మ నుంచి మొన్న వచ్చిన వి సినిమా వరకు వైవిధ్యమైన పాత్రలను చేస్తూ…. ప్రేక్షకులకు చేరువయ్యాడు న్యాచురల్ స్టార్ నాని. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఎప్పుడూ ఎంటర్ టైన్మెంట్ పాత్రల్లో నటించిన నాని ఇటీవల వీ సినిమాలో నెగిటివ్ పాత్రలో అద్భుతమైన విలనిజాన్ని పండిచాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసున్న నాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అయితే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో హైదరాబాద్‌లోనే కోల్‌కతా సెట్ నిర్మించనున్నారట. దాదాపు పది ఎకరాల విస్త్రీర్ణంలో రూ.6.5 కోట్ల బారీ బడ్జెట్‌తో ఈ సెట్‌ను రూపొందించబోతున్నారట.
శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్‌లోనే ఇప్పటివరకూ భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తోంది..ఇక ఇదిలా ఉంటె నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.. అసలైతే ఈ పాటికే టక్ జగదీష్ సినిమా విడుదలై ఉండాలి మ్.కానీ కరోనా వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారట టక్ జగదీష్ టీమ్…!!
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…