టాలీవుడ్ లో మొదటి సినిమా అష్టాచెమ్మ నుంచి మొన్న వచ్చిన వి సినిమా వరకు వైవిధ్యమైన పాత్రలను చేస్తూ…. ప్రేక్షకులకు చేరువయ్యాడు న్యాచురల్ స్టార్ నాని. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఎప్పుడూ ఎంటర్ టైన్మెంట్ పాత్రల్లో నటించిన నాని ఇటీవల వీ సినిమాలో నెగిటివ్ పాత్రలో అద్భుతమైన విలనిజాన్ని పండిచాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసున్న నాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అయితే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో హైదరాబాద్‌లోనే కోల్‌కతా సెట్ నిర్మించనున్నారట. దాదాపు పది ఎకరాల విస్త్రీర్ణంలో రూ.6.5 కోట్ల బారీ బడ్జెట్‏తో ఈ సెట్‏ను రూపొందించబోతున్నారట.

శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్‌లోనే ఇప్పటివరకూ భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తోంది..ఇక ఇదిలా ఉంటె నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.. అసలైతే ఈ పాటికే టక్ జగదీష్ సినిమా విడుదలై ఉండాలి మ్.కానీ కరోనా వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారట టక్ జగదీష్ టీమ్…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here