ప్రతిక్షణం ఎంతో ఆశక్తికరమైన సినిమాలను, వెబ్ సిరీస్ లను, టాక్ షో లను ప్రజల ముందుకు తీసుకువస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఓటీటీ మాధ్యమాలలో “ఆహా” ఒకటని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఓటిటి సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో విడుదలైన సినిమాలను తెలుగులోకి అనువదించి డబ్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు.
ఈ క్రమంలోనే తమిళ మెగా స్టార్ మమ్ముట్టి హీరోగా సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వంలో, ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. శ్రీలక్ష్మి నిర్మించిన సినిమా ‘వన్’. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంటరై రాజకీయాలలో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కొని ప్రజలకు సేవ చేస్తాడనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో ముమ్ముట్టి ముఖ్యమంత్రిగా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి ఆహా ద్వారా ప్రేక్షకులకు చేరువ చేయనున్నారు. ఈ క్రమంలోనే నేను కేవలం 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాదు.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల మందికి కూడా నేను ముఖ్యమంత్రిని అంటూ చెప్పే డైలాగులు ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీ నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…