తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అత్యధిక రికార్డులను నెలకొల్పిన మెగాస్టార్ కొద్ది కాలం సినిమాలకు విరామం చెప్పారు. ఈ క్రమంలోనే తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ లూసిఫర్ మలయాళ రీమేక్ చిత్రంలో నటించనున్నారు. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
చిరు బాబీకాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నిజానికి బాబీ ఈ సినిమా స్క్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి కోసం కాదని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోసం స్క్రిప్ట్ తయారు చేశారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడం కోసం విజయ్ దేవరకొండకు డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో.. ఈ సినిమాను రిజెక్ట్ చేసారట విజయ్. అయితే ఆ తరువాత ఈ సినిమా కథ మెగాస్టార్ కు బాబీ వినిపించారని తెలుస్తోంది.
బాబీ ఈ కథను చిరంజీవికి చెప్పడంతో వెంటనే చిరంజీవి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో చిరంజీవి గారికి తగ్గట్టుగా కథలో మార్పులు చేసినట్లు తెలిపారు.మరి నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…