దేశ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి గురించి అధికారులు ఎంతో అవగాహన కల్పిస్తున్నారు.కరోనా బారిన పడిన వారు ఏమాత్రం ఆందోళన చెందకుండా కేవలం జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని అధికారులు పదే పదే చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం ఈ మహమ్మారి పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా గురించి ఈ విధమైనటువంటి అపోహల వల్ల ఓ పచ్చని కుటుంబం ముక్కలైపోయింది.
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి అతుల్ లాల్ భార్య తులికకి ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తన భార్యకు పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ భర్త భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించారు. పాజిటివ్ వచ్చిన తన భార్యకు చికిత్స చేయించడం కాకుండా భార్య అన్న జాలి కూడా లేకుండా ఆ భర్త ఆమెను రెండు ముక్కలు గా చేశాడు.
ఈ విధంగా తన భార్యను చంపడమే కాకుండా అతను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే పోలీసులు మాట్లాడుతూ కేవలం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతోనే ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలిపారు.
కరోనా వైరస్ పై కొందరిలో అపోహలు ఏర్పడటం వల్ల ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కేవలం కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని మరోసారి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…