లాక్‌డౌన్‌లో గోధుమ పిండి కోసం బయటకు వచ్చాడు.. చివరికి?

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో కఠినమైన అంశాలను విధిస్తూ,అనవసరంగా బయట తిరిగితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది.

ప్రభుత్వాలు లాక్ డౌన్ పట్ల ఇంత కఠినమైన ఆంక్షలు పిలిచినప్పటికీ కొందరు మాత్రం అవేవీ తమకు పట్టనట్టుగా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారు.మొదటి దశలో లాక్ డౌన్ విధించినప్పుడు హైదరాబాద్ లో ఒక వ్యక్తి గోధుమపిండి కోసం బయటకు వచ్చానని సమాధానం చెప్పడంతో అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం అలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ లాక్ డౌన్ ఉన్న సమయంలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారి అతడిని ఆపి బయట ఎందుకు తిరుగుతున్నావు? అని ప్రశ్నించగా అందుకు ఆ వ్యక్తి తన మెడలో స్వీట్స్ కొనడానికి అని రాసి ఉన్న బోర్డును చూపించాడు.

ఈ విధంగా ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కు సిల్లీ సమాధానం చెప్పడంతో.. “ఏంటి? స్వీట్స్ కొనడానికి బయటకు వచ్చావా.. పద ఇంటికెళ్ళు.. అంటూ గట్టిగా మందలించి పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు అతని ప్రవర్తన పట్ల విమర్శించగా మరికొందరు సమర్ధిస్తున్నారు. స్వీట్స్ కూడా నిత్యావసర జాబితాలోనే ఉంది. స్వీట్స్ కొనడానికి ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతి ఇచ్చింది కనుక ఆ సమయంలో అతను స్వీట్స్ కొనడానికి వస్తే తప్పేముంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.