General News

చిన్ననాటి నుంచి ప్రేమ.. పెద్దలకు తెలియకుండా పెళ్లి.. చివరికి?

సాధారణంగా కొందరు వ్యక్తులు అమ్మాయిలను బుట్టలో వెయ్యడానికి ఎన్నో మాయమాటలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే మాటలతో వారిని నమ్మించి మోసం చేసి వారి సరదాగా తీర్చుకొని అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. చిన్నప్పటి ప్రేమ అంటూ తన భార్యకు విడాకులు ఇచ్చేస్తానని ఓ యువతిని నమ్మించి ఆమె పై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు…

సందీప ప్రసాద్ అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల క్రితమే వివాహమైంది. అతడికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఐటీ రిక్రూట్ కంపెనీలో పని చేస్తున్నటువంటి యువతిని కలిసిన సందీప్ తనని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, తనకోసం తన భార్యకి కూడా విడాకులు ఇచ్చేస్తానని, తనని పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంట పడుతున్నాడు. ఈ విషయంలో తాను ఒప్పుకోక పోతే చివరికి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ యువతి ఈ ఏడాది జనవరిలో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత రెండు నెలల పాటు అంతా సవ్యంగానే ఉంది.ఆ తరువాత హైదరాబాద్ నుంచి బెంగళూరు కి వెళ్లిన సందీప్ తనని కూడా అక్కడికే రావాలని, లేకపోతే పెళ్లి ఫోటోలను తన తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే బెంగళూరుకు వచ్చిన యువతి తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను కుషాయిగూడ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు.

ఈ సమయంలోనే సందీప్ ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేవిధంగా సందీప్ కుటుంబ సభ్యులు తను సందీప్ ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని పోలీసులు ఎదుట చెప్పాలని బెదిరించారు. ఈ విధంగా చిన్నప్పటినుంచి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి తనని పెళ్లి చేసుకుని తనపై అత్యాచారానికి పాల్పడడంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago