యాంకర్ గా.. నటిగా.. నిర్మాతగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు మంచు లక్ష్మీ. ఎటువంటి సందర్భంలో అయినా ఆమె తను అనుకున్నది చెప్పేస్తోంది. ధైర్యంగా తన అభిప్రాయాలను పంచుకుంటారు. లాక్ డౌన్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులకు టచ్ లో ఉంటోంది. గతంలో కూడా ఆమె సోషల్ మీడియా వేదికలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేది.
ప్రస్తుతం ఎక్కువ సమయం ఆమె సోషల్ మీడియాకు కేటాయిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి ఓ యూట్యూబ్ చానల్ ను కూడా ప్రారంభించారు. దానిలో ఆమె ఎన్నో విషయలను ఆమె అభిమానులతో పంచుకోనున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్ చానల్ లను మొదలు పెట్టి తమ అభిమానులకు దగ్గర అవుతున్నారు. మహమ్మారి కారణంగా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలామంది వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ ఉన్నారు.
తాజాగా మంచు లక్ష్మీ తన లగ్జరీ హౌస్ గురించి వీడియో చేయబోతోంది. ఈ వీడియోకు సంబంధించిన ప్రోమో ను ఆమె తన యూట్యూబ్ చానల్ లో విడుదల చేశారు. ఆ ప్రోమోలో ఆమె ఇల్లు ఎంతో అద్భుతంగా కినిపిస్తోంది. ఇంటి మెయిన్ గేట్ నుంచి పార్కింగ్ సెల్లార్.. ఇంటిలో వివిధ గదులు అత్యాధునిక హంగులతో కనిపిస్తున్నాయి. గదుల్లో వేసే ఇంటీరియర్ డిజైన్ అయితే మాత్రం చూడటానికి రెండు కళ్లు చాలవు. అలా ఉంది మరి డిజైన్.
అంతేకాకుండా వివిధ రకాల చిత్రపటాలతో ఇంటిని నింపేసింది. ఆ చిత్ర పటాలు గదులకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. లైబ్రరీ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. హోమ్ థియేటర్స్ కోసం కూడా ప్రత్యేకంగా గదిని డిజైన్ చేయించింది. ప్రోమోలోనే ఇలాంటివి ఉన్నాయంటే ఫుల్ వీడియో విడుదల అయితే అందులో ఇంకెంత అందంగా ఉంటుందో ఊహించుకోండి.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…