Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మంచు లక్ష్మి ఇండస్ట్రీలో ఒక నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె హైదరాబాద్ వదిలి ముంబై మకాం మార్చారు.
ఇలా ముంబై వెళ్లినటువంటి మంచు లక్ష్మి అక్కడ కూడా సినిమా అవకాశాలను అందుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముంబైలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ ముంబైలో నేను ప్రతి ఒక్కరికి తనని తాను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
హైదరాబాద్లో అయితే నన్ను చూస్తే లేచి నిలబడతారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై విమర్శలు కురిపించగా మరికొందరు మాత్రం మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకొని అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా…
మరి ముంబై వెళ్ళినటువంటి మంచు లక్ష్మి అక్కడ కూడా అవకాశాలు అందుకొని సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మంచు హీరోల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మంచు మనోజ్ వాటిది ఫిష్ అనే సినిమాతో పాటు మరోవైపు టీవీ షో ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మంచు విష్ణు సినిమాలో విషయానికి వస్తే ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిత్ర బృందం న్యూజిలాండ్ లో షూటింగ్ పనులు జరుపుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…