Categories: FeaturedMovie News

Bigg Boss 7: కెప్టెన్సీ టాస్క్ విషయంలో అతి చేసిన కంటెస్టెంట్లు… కెప్టెన్సీ రద్దుచేసి షాక్ ఇచ్చిన బిగ్ బాస్!

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ కార్యక్రమం 12వ వారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో కెప్టెన్సీ టాస్కుల పెద్ద ఎత్తున పోటీపడుతూ కెప్టెన్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేశారు. ఇక ఈ టాస్క్ కూడా చివరికి రాగా కేవలం కంటెస్టెంట్ల ఈగో ప్రాబ్లం వల్ల ఏకంగా ఈ వారం కెప్టెన్సీనే బిగ్ బాస్ రద్దు చేసి షాక్ ఇచ్చారు.

చివరిలో కెప్టెన్సీదారుల పోటీలో గౌతమ్ అమర్ ఉన్నారు. అయితే వీరిలో ఎవరో ఒకరిని ఎంచుకొని మరొకరి ఫోటో కాల్చి వేయాలని చెప్పారు. ఈ నిర్ణయం శోభాశెట్టికి శివాజీకి ఇవ్వగా శివాజీ గౌతమ్ కృష్ణను సపోర్ట్ చేయగా, శోభ అమర్ ను సపోర్ట్ చేస్తుంది. వీరిద్దరిలో ఎవరే ఒకరిని మాత్రమే ఎంచుకోవలసి ఉండగా వీరిద్దరూ కూడా కాంప్రమైజ్ కాలేదు చివరికి అమర్ తనని ఎలాగైనా కెప్టెన్ చేయాలి అని చాలా దీనంగా వేడుకున్నారు. అయినప్పటికీ ఎవరూ కూడా తగ్గడం లేదు. ఇక శోభ శెట్టి అన్న మాటలకు గౌతమ్ కూడా హర్ట్ అయ్యాడు.

ఇలా గౌతమ్ హర్ట్ కావడంతో తాను కూడా తగ్గేదేలే అన్నట్టు పంతానికి ఉన్నారు. అప్పటికి బిగ్ బాస్ హెచ్చరిస్తూ సరైన సమయం ఇచ్చాడు కానీ ఆ సమయం పూర్తి అయినప్పటికీ కూడా ఎవరు కాంప్రమైస్ కాకపోవడంతో బిగ్ బాస్ చేసేదేమీ లేక గౌతమ్ అలాగే అమర్ ఇద్దరి ఫోటోలను కాల్చివేసి ఈ వారం కెప్టెన్సీ రద్దు చేశారని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వీరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేసుకొని ఉంటే సరిపోయేదని ఈగో ప్రాబ్లం వల్ల కెప్టెన్సీని రద్దు చేసుకున్నారని చెప్పాలి.

డేంజర్ పొజిషన్లో రతిక, అశ్విని…

మరి వీకెండ్ లో భాగంగా నాగార్జున వచ్చినప్పుడు ఈ వారం కెప్టెన్ గా ఎవరినైనా ఎంపిక చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా శోభ శెట్టి ప్రియాంక తప్ప మిగిలిన 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. అయితే డేంజర్ పొజిషన్లో అశ్విని రతిక ఉన్నారని చెప్పాలి. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. గతవారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago