Manchu Lakshmi: మామూలుగా సినిమా ఇండస్ట్రీ వారికి చెందిన ఎలాంటి వార్త కోసమైనా జనాలు ఆసక్తి చూపుతుంటారు. జనాల్లో ఉన్న ఈ ఆసక్తిని ట్రోల్స్, మీమ్స్ వేరే లెవల్ కు తీసుకెళుతున్నాయి. ఎవరైనా హీరో లేదంటే హీరోయిన్ కాస్త అటుఇటుగా మాట్లాడినా, ఫోటోలు పెట్టినా, వీడియోలు పెట్టినా వెంటనే ట్రోల్స్ చేస్తూ వారిని ఇబ్బందికి గురిచేస్తుంటారు.
ఇలా ట్రోల్ అయ్యే వారిలో మంచు వారి కుటుంబానికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. మంచు ఫ్యామిలీకి చెందిన అందరి మీద రకరకాలుగా ఎప్పుడూ ట్రోల్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఇదే కోవలో తాజాగా మంచు వారి గారాట పట్టి, మంచు మోహన్ బాబు కూతురైన మంచు లక్ష్మి మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతలా ట్రోల్ చేయడానికి మంచు లక్ష్మికి చెందిన ఒక ఫోటోనే కారణం.
మంచు లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఓ యూట్యూబ్ యాంకర్ ఏకంగా ఆమెను హగ్ చేసుకొని మరీ ఫోటోకు స్టిల్ ఇచ్చాడు. ఇలా ఒకరినొకరు హగ్ చేసుకున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి.. బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడం ట్రోలింగ్ కు కారణం అయ్యింది. ఇంతకీ ఆ యూట్యూబ్ యాంకర్ ఎవరో కాదు.. నిఖిల్ విజేంద్రసింహా.
మంచు లక్ష్మికి బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతూ.. క్లోగ్ గా హగ్ చేసుకొని ఉన్న ఫోటోని నిఖిల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది.. బర్త్ డే విష్ చేయాలంటే ఇలా హగ్ చేసుకోవాలా అని, ఇంకొందరు.. ఇద్దరి జోడి బాగుంది, పెళ్లి చేపుకోండని, మరికొందరు కోతికి చిక్కిన కొబ్బరి చిప్పలా ఉందంటూ భయంకరంగా కామెంట్స్ పెట్టారు.
కాగా మంచు మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మికి తెలుగుతో పాటు తమిళంలో గుర్తింపు ఉంది. ఈమె తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో ఆమె నటనకు గాను 2012లో నంది అవార్డును అందుకుంది. ‘దొంగాట’ సినిమాలో ‘ఏందిరో’ అనే పాటకు బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డును కూడా అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…