Bigg Boss 6: తెలుగులో ఎన్నో అంచనాల మధ్య బిగ్ బాస్ సీజన్ 6 అట్టహాసంగా ప్రారంభమైంది. గత సీజన్లు ఎంతో ఆదరణను సొంతం చేసుకోవడంతో ఈ సీజన్ ను అందరినీ అలరిస్తుందని భావించారు. కానీ ప్రారంభం నుండి బిగ్ బాస్ ఉసూరుమనిపించింది. బిగ్ బాస్ సీజన్ 6లో పరిచయం ఉన్న ఫేమస్ పర్సనాలిటీలు పెద్దగా లేకపోవడం, బిగ్ బాస్ కంటెస్టెంట్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. షో యావరేజ్ గా సాగుతోంది.
అయితే తాజాగా బిగ్ బాస్ మీద వరుస వివాదాలు సాగుతున్నాయి. బిగ్ బాస్ లో ప్రెగ్నెన్సీ టెస్టులు నడుస్తున్నాయంటూ ఆ మధ్యన హైకోర్టులో ఏకంగా పిటిషన్ కూడా పడింది. అదో బ్రోతల్ హౌజ్ అంటూ బిగ్ బాస్ హౌజ్ గురించి సీపీఐ నారాయరణ అప్పట్లో కామెంట్ కూడా చేశారు. ఇలాంటి విమర్శలకు మరింత ఊతమిస్తూ.. బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువైంది.
బిగ్ బాస్ షోకి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో.. అశ్లీతతో ఆటను రక్తికట్టించాలనే భావనలో ఉన్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు ఉన్న వాళ్లు జంటలుగా మారి.. సరసాలాడుతున్నారు. తమలోని రసికత్వాన్ని బయటకు తెచ్చి జనాల్లో కోపాన్ని తెప్పిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో ఇనయ-ఆర్జే సూర్యల మధ్య సరసాలు హీటెక్కిస్తున్నాయి.స
బిగ్ బాస్ లో జరుగుతున్న విషయాల గురించి చెప్పాలంటూ ఫైమాకు టాస్క్ రాగా.. ఆమె ఆర్జే సూర్య-ఇనయల మధ్య జరుగుతున్న తంతు గురించి అంతా వివరించింది. సందు దొరికితే ఇద్దరూ రెచ్చిపోతున్నారంటూ వెల్లడించింది. ఇక ఈ విషయం మీద సమాచారం తెలుసుకున్న అక్కినేని నాగార్జున ఇనయకు గట్టిగా క్లాస్ పీకాడు. ఇనయకు గేం మీద కన్నా మనుషులు మీద దృష్టి ఎక్కువైందంటూ గట్టిగానే కామెంట్ చేశాడు. మరి నాగార్జున వార్నింగ్ తోనైనా ఇనయ-సూర్యలు మారతారా? బిగ్ బాస్ హౌజ్ లో సరసాలు తగ్గుతాయా? అనేది తేలాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…