Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వెర్సెస్ మంచు ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇలా వీరిద్దరి అభిమానుల మధ్య లేదా రెండు కుటుంబాల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరితో స్థాయిలో విమర్శలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి.
ఇకపోతే తాజాగా మరోసారి నటి కరాటే కళ్యాణి చేసినటువంటి ఒక పోస్ట్ కారణంగా మెగా వర్సెస్ మంచు అని వీరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అసలు వీరిద్దరికీ కరాటే కళ్యాణ్ కి గల సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…గత కొద్ది రోజుల క్రితం కమెడియన్ పాకీజా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉందని తెలియడంతో ఆమెకు మెగా కుటుంబం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఆమె పరిస్థితి తెలుసుకొని తనకు సహాయం చేయడమే కాకుండా మరికొందరు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణు తన డబ్బుతో పాకీజాకు ఉచితంగా మా మెంబర్ షిప్ కార్డ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మంచు విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్ కింద కొందరు మెగా అభిమానులు స్పందిస్తూ పాకీజా గారికి ముందుగా మెగా ఫ్యామిలీ ఆర్థిక సహాయం చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు మంచు అభిమానులు కరాటే కళ్యాణికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈమె చేసిన పోస్ట్ కారణంగా మెగా వర్సెస్ మంచు అనేలా ఇద్దరి అభిమానుల మధ్య వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే కొందరు మెగా అభిమానులు కరాటే కళ్యాణి పై ఫైర్ అవుతున్నారు.
ఓటీటీ వేదికపై కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న సరస్వతి సినిమా, కథా నేపథ్యం వల్ల ప్రారంభంలోనే ఆసక్తిని కలిగించినా, ఆ ఆసక్తిని…
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం చివరకు హత్యకు దారితీసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం…
యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాస సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. విడుదలైన…
తమిళ బుల్లితెర రంగంలో గుర్తింపు పొందిన నటి సుభాషిణి మృతి వార్త సినీ, టీవీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.…
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడికు నిర్మాత దిల్ రాజు నుంచి ఆసక్తికర ఆఫర్ రావడం ఇండస్ట్రీలో…
టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటి జాన్వీ కపూర్ తన టీనేజ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా…