Featured

Manjula Ghattamaneni : మహేష్ నా బర్త్ డేకి ఫోన్ చేసి ఏంటి ప్లాన్ అంటాడు కానీ విష్ మాత్రం చేయడు.. ప్రేమను చూపించలేడు : మంజుల

Manjula Ghattmaneni : సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. కృష్ణ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేయాలని ఆసక్తి ఉన్నా కృష్ణ అభిమానులకు నచ్చకపోవడంతో విరమించుకుంది. కానీ మంజుల తన సినిమా కెరీర్ లో సెల్వమణి దర్శకత్వంలో ‘రాజస్థాన్’ అనే సినిమాలో నటించింది. ఇక మలయాళం లో సురేష్ గోపి సినిమాలో నటించింది. ఇక తెలుగులో ‘షో’ అనే సినిమాను స్వయంగా నిర్మించి, నటించారు మంజుల. ఈ సినిమాకు నీలకంఠ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం విశేషం. మంజుల గారు సినిమా మీద ఇష్టంతో నిర్మాతగా మారి తల్లి పేరు మీద ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు.

మహేష్ ప్రేమను చూపించలేడు…

ఇక తన తమ్ముడు మహేష్ సూపర్ స్టార్ గా తన తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నాడు. మంజుల ఇక తమ్ముడి గురించి మాట్లాడుతూ తాను ప్రేమను బయటికి చూపించడు అని చెప్పారు. పుట్టినరోజున ఫోన్ చేస్తే విష్ కూడా చేయడు. ఊరికే ఏంటి ఈరోజు ప్లాన్స్ అంటూ మాట్లాడుతాడు అంతే కానీ కచ్చితంగా ఆరోజున ఫోన్ చేస్తాడు, మా అమ్మ కూడా ఎపుడూ చెబుతుంది వాడు పైకి చెప్పడే ఇష్టాన్ని అన్నీ మనసులో దాచుకుంటాడు అంటూ చెప్పింది మంజుల.

ఇక కృష్ణ గారి ప్రేమ అన్ కండిషనల్ ప్రేమ అంటూ చెప్పింది. ఇక భర్త సంజయ్ స్వరూప్ గురించి మాట్లాడుతూ ప్రతి పనిలోనూ నాకు సపోర్ట్ చేస్తూ నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహించే వ్యక్తి సంజయ్ అని మంజుల తన భర్త గురించి చెప్పింది. ఇక మహేష్ తన మంచి జడ్జి అంటూ చెప్పింది. ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా విషయాన్ని చెప్పేస్తాడు. నేను చేసే పనిలో తప్పులను నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి మహేష్ బాబునే అని చెప్పింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago