Rashmika: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఏకంగా పాన్ ఇండియా సినిమాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు నటి రష్మిక.ఇలా ఈమె నటించిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాడమే కాకుండా రోజురోజుకు తనకు అభిమానులు పెరగడంతో ఎంతో డిమాండ్ ఏర్పడింది.
ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసి వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్న రష్మిక క్రేజ్ చూసి ఎంతోమంది హీరోయిన్ల అభిమానులు కుళ్లుకుంటూ ఉన్నారు.ఈమె కన్నా ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నప్పటికీ ఇలా బాలీవుడ్ అవకాశాలను మాత్రం అందుకోలేకపోతున్నారని రష్మిక అభిమానులు భావిస్తున్నారు.
అదేవిధంగా ఈమెకు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా వచ్చిందని అందుకే ఇలా తొందరగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించిన రష్మిక తాను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ కాలేదని తన స్టార్డం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా రష్మిక స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తాను రాత్రికి రాత్రి సెలబ్రిటీ కాలేదని, అదృష్టాన్ని తన వెనుక తిప్పుకోలేదని తాను ఈ స్థాయికి రావడానికి ఏడు సంవత్సరాలు కష్టం పడ్డానని, ఈ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో బాధలు దిగమింగుకున్నాను, ఎన్నో త్యాగాలు చేశానని రష్మిక కెరియర్ మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ సందర్భంగా వెల్లడించారు. హీరోయిన్గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోవాలంటే ఒక రాత్రి సరిపోదు ఎంతో ఓపిక శ్రమ పట్టుదల కావాలని ఈ సందర్భంగా ఈమె తెలిపారు. ఇలా రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…