Sai pallavi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సాయి పల్లవి. ఈమె ఇండస్ట్రీలో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగారు. కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చిరంజీవి డాన్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె నటన ఎంతో సహజ సిద్ధంగా ఉంటుందో ఈమె డాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సాయి పల్లవితో కలిసి డాన్స్ చేయాలి అంటే హీరోలు కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది అంతలా ఈమె డాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది ఇలా మంచి డాన్సర్ అయినటువంటి ఈమె చిరంజీవి డాన్స్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ స్టెప్స్ వేయలేకపోయాను..
చిరంజీవి ఎంతో అద్భుతమైనటువంటి డాన్సర్ అని ఈమె తెలిపారు. ఆయనలా డాన్స్ చేయాలని ఆయన వేసిన స్టెప్స్ ఎన్నోసార్లు వేయాలని ప్రయత్నం చేసిన ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చిరంజీవి గారి డాన్స్ కి ఉన్నంత గ్రేస్ నాకు రాలేదని ఆయనలా నేను చేయలేకపోయాను అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…