Upasana: మెగా కోడలు ఉపాసన తన తాతయ్య అపోలో హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ సి ప్రతాపరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈమె చెన్నై వెళ్లారు. తన తాతయ్య 91వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నై వెళ్లినటువంటి ఉపాసన తన తాత పుట్టినరోజు సందర్భంగా ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్నిr ఆవిష్కరించారు.
ఇలా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే చెన్నై గురించి మాట్లాడుతూ..నేను చెన్నై లోనే జన్మించానని తెలిపారు. ఇక రామ్ చరణ్ కూడా చెన్నైలోనే జన్మించారని ఈ సందర్భంగా ఉపాసన తెలిపారు.
మేమిద్దరం ఇక్కడే జన్మించడంతో మా ఇద్దరికీ చెన్నై అంటే చాలా స్పెషల్ అని చెన్నై సిటీ తమకు చాలా ఇష్టమైన ప్రదేశం అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. కొణిదెల కామినేని కుటుంబాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలా అయితే ఆదరణ ఉందో చెన్నైలో కూడా అదే ఆదరణ ఉందని మాపై ఇలాంటి మంచి ఆదరణ చూపిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు అంటూ ఈమె తెలిపారు.
చెన్నై అంటే చాలా ఇష్టం..
ఇలా రామ్ చరణ్ తాను ఇద్దరం చెన్నైలోనే జన్మించాము అందుకే మాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉపాసన రాంచరణ్ హైదరాబాద్ లోనే నివసిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్ సినిమాల పరంగా బిజీ అవ్వగా ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…