Teja Sajja: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం హనుమాన్ ఈ సినిమా విడుదలయి 25 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఒక చిన్న సినిమాగా కేవలం 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది అలాగే ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ హీరోగా ఈ సినిమాలో నటించారు.
ఈ విధంగా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం అయినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి విజయాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సంక్రాంతికి విడుదలవుతున్నటువంటి ఈ సినిమాపై ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యాయి. స్టార్ హీరోలతో పోటీ పడటం అవసరమా అంటూ కొందరు ఈ సినిమా విడుదల తేదీపై కామెంట్లు కూడా చేశారు.
సినిమా కంటెంట్ పైన నమ్మకంతో దర్శకుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా స్టార్ హీరోలకు పోటీగా ఈ సినిమాని విడుదలకు సిద్ధం చేశారు. అనుకున్న విధంగానే ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల 25 రోజులు పూర్తి కావడంతో మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ఈ సినిమా కలెక్షన్లను వెల్లడించారు.
తగ్గని క్రేజ్..
25 రోజులకు గాను ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో తేజ కూడా ఓ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…