General News

ఈ ఉసిరిలో ఎన్నో ఔషధాలు.. వేర్ల నుంచి ఆకుల వరకు అన్నీ ఉపయోగాలే..!

ప్రకృతిలో ప్రతీదీ మానవుడికి ఉపయోగపడేవే. అయితే ఇందులో పువ్వులు, మొక్కలు, ఆఖరికి మొక్కల వేర్లు కూడా మనిషికి ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో నేల ఉసిరి అనేది చాలా ఉపయోగపడుతుంది. నేల ఉసిరి మొక్క యొక్క వేర్ల నుంచి ఆకుల వరకు అన్నీ ఉపయోగపడేవే.

మన చుట్టూ పెరిగే కొన్ని మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.. కానీ వాటిని మనం పనికిరావనుకొని పీకేస్తుంటాం. ఇలా గుంటగలగర , సరస్వతి, ఉత్తరేణి, గరిక, అశ్వగంథ ఆకులు ఔషధ మొక్కల్ని పీకి పారేస్తుంటాం. అటువంటిదే.. నేల ఉసిరి కూడా. ఎన్నో వ్యాధుల నివారణకు ఈ మొక్క ఆకులు ఉపయోగపడతాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఔషద లక్షణాలు నేల ఉసిరిలో ఉంటాయి.

పొత్తి కడుపులో మంట తగ్గడానికి నేల ఉసిరిని జ్యుస్ గా తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. శరీరంలో ఎసిడిటీ, ఆమ్లత్వం నుండి ఉపశమనం పొందడానికి నేల ఉసిరి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని కూడా ఇది నివారిస్తుంది. మూత్రపిండాల్లో పేరుకున్న రాళ్లను కరిగించడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా.. హెపటైటిస్, కామెర్లు, కాలేయ ఆరోగ్యానికి ఇది దివ్య ఔషధంగా ఉంటుంది.

కంటి సమస్యలతో బాధపడే వారికి నేల ఉసిరి రసాన్ని ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు. మధుమేహ నివారణకు ఈ జ్యూస్ తాగడం చాలా మంచిది. చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి నేల ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆకలి లేనివారు నేల ఉసిరి మొక్క ఆకుల్ని ఉదయం సాయంత్రం నమిలితే ఆకలి వేస్తుంది. పశువులకు కళ్ల నుంచి నీరు గారే సమస్య ఉంటే.. నేల ఉసిరిని జ్యూస్ లా చేసి వాటి కళ్లల్లో వేస్తే నీరు కారడం ఆగిపోతుందట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago