Featured

Medico Suicide : దారుణంగా మర్మాంగాన్ని కోసుకుని యువకుడు ఆత్మహత్య…!

Medico Suicide : విద్యార్థులు, యువకులలో జీవన సరళి, పోటీతత్వం వల్ల ఒత్తిడి పెరిగి నేటి ఉరుకుల పరుగుల జీవనంతో పోటీ పడలేక, ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మన ఇండియాలో ఇపుడు ఆత్మహత్యలు అందులోనూ స్టూడెంట్స్ నుండి ఎక్కువయ్యాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన సమయంలో ఒక్కసారి తల్లిదండ్రులు, స్నేహితులు, తోబుట్టువులు ఇలా తమవారితో ఒక్కసారి మాట్లాడితే వారి ఆలోచన మార్చుకుంటారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఒక మెడికో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

మానసిక సమస్యలతో బాధపడుతున్న యువకుడు…

సికింద్రాబాద్‌ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న 21 సంవత్సరాల దీక్షిత్‌ రెడ్డి అనే యువకుడు ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంఘటన జరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి నివసిస్తున్నారు. వీరికి ఓ కూతురు, కొడుకు దీక్షిత్‌ రెడ్డి ఉన్నారు. దీక్షిత్‌ రెడ్డి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నాడు.

గతంలోను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తరచూ మందులు వేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి అంటూ బాధపడేవాడు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల తల్లిదండ్రులు దీక్షిత్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయిస్తున్నారు. కుటుంబ సభ్యులు బయటకెళ్లిన సమయంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీక్షిత్ రెడ్డి. తన మర్మాంగాన్ని కోసుకుని అత్యంత బాధాకరంగా అతను మరణించడానికి గల కారణలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

4 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

6 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

6 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

7 hours ago