Mega Hero: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి వారసులిగా ఆయన తమ్ముళ్లతో పాటు అల్లుళ్ళు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇలా మెగా అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, విన్నర్, సోలో బతుకే సో బెటర్ వంటి సినిమాలలో నటించి మంచి హిట్ అందుకున్నాడు.
హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల ప్రమాదానికి గురవటంతో చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సాయి ధరమ్ తేజ్ వివాహం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. తాజాగా మరొక్కసారి సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్త వైరల్ కావటానికి కారణం హీరోయిన్ లారిస్సా బోనేసి పెట్టిన ట్వీట్ . బ్రెజిల్ కి చెందిన లారీస్సా బోనేసి మోడల్ గా కెరియర్ ప్రారంభించి “తిక్క” సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించకుంది. అయితే ఈ సినిమా క్లాస్ అవ్వటంతో ఈమె సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. తాజాగా సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సాయిధరమ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు హీరోయిన్ లారిస్సా బోనేసి “హ్యాపి బర్త డే మై తేజు” అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత “ఐ యామ్ ఇన్ లవ్ ” అంటూ మరొక ట్వీట్ పెట్టింది . ఇలా ట్వీట్ చేయటంతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సాయిధరమ్ తేజ్ స్పందించాల్సి ఉంటుంది.
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…