Chiranjeevi: మెగాస్టార్ పద్మ విభూషణ్.. చిరంజీవి స్పందన ఇదే.. వీడియో వైరల్?

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఎంతోమంది హీరోలకు ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచారు. ఇకపోతే నేడు అనగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఐదుగురు పద్మ విభూషణ్, 17 మంది పద్మ భూషణ్ తో పాటు 110 మంది పద్మశ్రీ అవార్డులు పొందారు. అయితే పద్మ విభూషణ్‌ అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.

ఏకంగా పద్మవిభూషన్ అవార్డుని అందుకోబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనకు పద్మ విభూషణ్ అవార్డు వరించడంతో మెగాస్టార్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ వీడియోలో మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడంతో భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నుంచి ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తాను తెలియడం లేదు.

దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు నీడలా తనతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేడు ఈ ఉన్నత స్థితిలో ఉంచాయి. నాకు దక్కిన గౌరవం మొత్తం నన్ను ఆదరించేవారిదే. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటూఎమోషనల్ అయ్యారు మెగాస్టార్. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో నిత్యం వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ, అభిమానులకు వినోదం పంచుతున్నాను.

ఆపదలో ఉన్నవారికి సహాయం చేశాను..

నా శక్తి మేర ఎంటర్టైన్ చేస్తున్నాను అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే తన నిజ జీవితంలోనూ అపదలో ఉన్నావారికి నాకు తోచిన సాయం చేస్తాను అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసిన అభిమానులు మెగాస్టార్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.