Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్‌డౌన్‌లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు, అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ రావడం గర్వ కారణం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేస్తూ తనను ఆదరిస్తున్న అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ వీడియోని కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్ లు కూడా చేశారు. అందులో భాగంగానే మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది.
మామయ్యకు అభినందనలు తెలిపిన ఉపాసన..
మామయ్య చిరంజీవికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ డియరెస్ట్ మామయ్య అంటూ పద్మ విభూషణ్‌కు అవార్డులు పొందిన వారి లిస్ట్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్‌కు అభినందనలు చెబుతున్నారు. ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయిత్వ ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…