Movie News

Arjun Sarja: అర్జున్ సర్జా చిన్న కూతురి బిజినెస్ రూటే వేరు.. పండ్లతొక్కలతో అలాంటి వ్యాపారం?

Arjun Sarja: తెలుగు ప్రేక్షకులకు హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు,కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అర్జున్ సర్జా. తెలుగులో కూడా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు అర్జున్ సర్జా. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు హీరోగా నటించిన అర్జున్ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన అర్జున్ సహాయ నటుడిగా, విలన్ పాత్రలు పోషిస్తున్నారు.

అయితే అర్జున్ సర్జా ఫ్యామిలీలో చాలా మంది హీరో హీరోయిన్లుగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు ధృవ సర్జా హీరోగా రాణిస్తున్నారు. ఇక ఆయన పెద్దు కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా ఐశ్వర్య సర్జా తొలిసారిగా విశాల్ సరసన పట్టతు యానై అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో ప్రేమ బరహ చిత్రంలో నటించింది. కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె పెళ్లికి సిద్ధమయ్యింది. ప్రముఖ హాస్యనటుడు తంబీ రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో గత ఏడాది నిశ్చితార్థం జరిగింది.

అయితే గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరీ ఎంగేజ్మెంట్ వేడుక గత ఏడాది అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అర్జున్ సర్జా చిన్న కూతురి గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆయన చిన్న కుమార్తె పేరు అంజనా అర్జున్. తండ్రిలాగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకుండా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‏లో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు.

పండ్ల తొక్కలతో భారీ సంపాదన..

గతంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సంస్థను ప్రారంభించి అంజనా అర్జున్ ను అభినందించారు. అంతేకాదు హ్యాండ్ బ్యాగ్ తయారీలో అంజనా అర్జున్ రూటే సపరేటు. హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేయడానికి ముడి పదార్థంగా పండ్ల తొక్కలను ఉపయోగిస్తున్నారు. పండ్ల తొక్కలను వాడే ప్రత్యేకమైన ఫార్ములాతో ఆమె ఈ హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. ఈ పద్దతి ప్రపంచంలో మునుపెన్నడూ ప్రయత్నించలేదు. అటు అంజనా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ బిజినెస్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తు ఉంటుంది. చాలామంది ఆమె బిజినెస్ గురించి తెలిసి నిజంగా ఇది సరికొత్త ఐడియా, మంచి బిజినెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

23 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago