Movie News

Vishwambhara: భారీ ధరకు అమ్ముడైన విశ్వంభర ఓవర్ సీస్ రైట్స్.. ఏకంగా అన్ని కోట్లు?

Vishwambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరు. ఇది ఇలా ఉంటే గత ఏడాది వాళ్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దశరత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు చిరంజీవి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

వచ్చేనెల అనగా ఫిబ్రవరి 1 నుంచి విశ్వంభర సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు చిరంజీవి. సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారని తెలిసింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివీల్ చేస్తూ టీజర్ ఒకటి విడుదల చేశారు, అది వైరల్ అయింది కూడా. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. ఆల్రెడీ ఓవర్ సీస్ రైట్స్ ని రికార్డ్ ప్రైస్ కు అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్. ఈ క్రమంలో ఈ భారీ చిత్రం ఓవర్సీస్ హక్కులు 18 కోట్లకు రికార్డు ధరకు అమ్ముడయ్యాయట.

విజువల్ వండర్ లా విశ్వంభర మూవీ..

కాగా ఇది చిరంజీవి కెరీర్‌ లోనే రికార్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. సరిగమ సినిమా ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో VFX వర్క్స్ చాలా ఉన్నాయి. విశ్వంభర విజువల్ వండర్ లా ఉండబోతుంది. ఈ చిత్రం కథ మూడు లోకాల్లో తిరుగుతుందట. అందుకే ముల్లోకాల వీరుడు అనే టైటిల్ మొదట అనుకున్నారట. అయితే ఆ టైటిల్ బాగున్నా ఏదో డబ్బింగ్ సినిమా టైటిల్లా ఉందని భావించారట. దాంతో విశ్వంభర అనే టైటిల్‌ ని పెడదామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

23 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago